ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసే హెర్బల్ హెయిర్ ఆయిల్!
ఇపుడున్న ప్రెసెంట్ సిట్యుయేషన్ లో ప్రజలందరూ హెర్బల్ హెయిర్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆంటే అడవిలో దొరికే మన కేశాల ఆరోగ్యాన్ని పెంచే మూలికలతో నూనెని తయారు చేస్తారు. అయితే మనం అడవి కి వెళ్ళి మూలికలను తెచ్చి ఆయిల్ని తయారు చేసుకోవాలి అని ఏమీ లేదు. మనం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులువుగా మనం న్యాచురల్ హెయిర్ ఆయిల్ ని తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. వీటితో నూనె తయారు చేసుకొని జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ధృడంగా పెచ్చుకోవచ్చు. ఈ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలి? ఏ ఏ మూలికలు వాడాలి ? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం!!
ముందుగా ఒక 100g ఆవల నూనెని తీసుకొని ఒక IRON BOWL లో వేసుకొని పొయ్యి వెలిగించి దాన్ని పెట్టండి. మంట సిమ్ లో పెట్టి ఇపుడు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ నూనె లో వేయాలి. తర్వాత ఒక 10 నుండి 15 వరకు లవంగాలు ఒక టి స్పూన్ మెంతులు ఈ నూనె లో వేయాలి. ఇపుడు ఈ మూడింటిని ఈ ఆయిల్ లో బాగా boil చేయాలి. వాటిలో వుండే ఆ విటమీన్స్ మినేరల్స్ అన్నీ ఆ ఆయిల్ కి బాగా పట్టాలి అంటే వాటిలోని పచ్చిదనం పోయే అంతవరకు మరిగించాలి. ఇప్పుడు మన ఆయిల్ తయారీ పూర్తి అయ్యింది. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఆయిల్ ని మనం హెయిర్ wash చేసుకున్న తర్వత జుట్టు బాగా ఆరిన తర్వత ఆయిల్ ని జుట్టుకి పెట్టుకోవాలి. అయితే ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వేడిగా వున్నపుడు జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తున్నపుడు మాడుకి కొంచెం మర్ధన చేసుకుంటూ అప్లై చేసుకుంటే scalp లో blood circulation బాగా జరుగుతుంది, కాబట్టి మన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.
లాభాలు:-
ఉల్లిపాయ:
ఉల్లిపాయాలో వుండే జింక్, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం తో పాటు విటమిన్ బి లు పుష్కలంగా వుండడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి.
ఆవల నూనె:
మన జుట్టుకి ఆవాల నూనె పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ ని మెరుగు పరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. ఇందులో విటమిన్ ఎ వల్ల జుట్టు రాలడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది.
లవంగాలు:
లవంగాలలో యాంటీ మైక్రోబయల్ యాంటీఫంగల్, యాంటీవైరల్, యాంటీసెప్టిక్ లక్షణాలు వుండడం వల్ల జుట్టు సంరక్షణకు సహాయపడతాయి
మెంతులు:
మెంతుల్లో వుండే ప్రోటీన్, పొటాషియం, జింక్ మరియు విటమిన్ సి అనేవి scalp ని ఆరోగ్యంగా మార్చి హెయిర్ ఫోలికల్స్ బలంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది జుట్టుని బలంగా, ధృడంగా పెంచుతుంది. జుట్టుని మృదువుగా మెరిసెలా చేస్తుంది.
గమనిక:
ఇది ఒక సలహా మాత్రమే. ఇక్కడ చెప్పిన చిట్కాలు రెమెడీస్ అన్నీ నేను వాడి దాని ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.